జమ్మూ–కాశ్మీర్‌కు వెళ్తున్న పశువుల రవాణా వాహనాల నుంచి పంజాబ్‌లో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు లేఖ రాశారు. అన్ని అనుమతులు, చట్టబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ కొన్ని కాంట్రాక్టర్ గ్రూపులు వాహనాలను అడ్డుకుని అక్రమంగా రుసుములు వసూలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో రవాణాదారులకు ఆర్థిక భారం పెరగడంతో పాటు జంతువుల సంక్షేమం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకుని చట్టబద్ధంగా ప్రయాణించే వాహనాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఈ అక్రమ వసూళ్ల ప్రభావం మాంసం ధరలపై కూడా పడుతోందని ప్రభుత్వం తెలిపింది.

జమ్మూ–కాశ్మీర్ పశువుల రవాణాపై అక్రమ వసూళ్లు నిలిపివేయాలని పంజాబ్ సీఎంకు ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి