Saturday, 3 October 2026
  • Home  
  • జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి
- అనకాపల్లి

జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి

గ్రామ జ్యోతి యువతకు పెన్నుల పంపిణీ.. బేరా శ్రీనివాసరావు–శ్రీదేవి దంపతులకు అభినందనలు పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ( యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు పరిధిలోని కొక్కిరపల్లి గ్రామానికి చెందిన మార్గదర్శకులు, మద్రాస్ వాస్తవ్యులు బేరా శ్రీనివాసరావు–శ్రీదేవి దంపతులు తమ జన్మదిన సందర్భంగా గ్రామ జ్యోతి యువతకు పెన్నులు పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న యువతను అభినందించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వివేకానంద రీడింగ్ బుక్స్ గ్రంథాలయం వద్ద గ్రామ పెద్దలు భైరవభట్ల శివరాం చేతుల మీదుగా గ్రామ జ్యోతి యువతతో పాటు చిన్నారులకు పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా యువత బేరా శ్రీనివాసరావు–శ్రీదేవి దంపతులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, తమను ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, గ్రామ జ్యోతి యువత సభ్యులు దేవి ప్రసాద్, యస్వంత్, నాగేష్, ఆనంద్, నిఖిల్, దరిణి, యామిని, శ్రావణి తదితరులతో పాటు చిన్నారులు పాల్గొన్నారు.

గ్రామ జ్యోతి యువతకు పెన్నుల పంపిణీ.. బేరా శ్రీనివాసరావు–శ్రీదేవి దంపతులకు అభినందనలు

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో (

యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు పరిధిలోని కొక్కిరపల్లి గ్రామానికి చెందిన మార్గదర్శకులు, మద్రాస్ వాస్తవ్యులు బేరా శ్రీనివాసరావు–శ్రీదేవి దంపతులు తమ జన్మదిన సందర్భంగా గ్రామ జ్యోతి యువతకు పెన్నులు పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న యువతను అభినందించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వివేకానంద రీడింగ్ బుక్స్ గ్రంథాలయం వద్ద గ్రామ పెద్దలు భైరవభట్ల శివరాం చేతుల మీదుగా గ్రామ జ్యోతి యువతతో పాటు చిన్నారులకు పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా యువత బేరా శ్రీనివాసరావు–శ్రీదేవి దంపతులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, తమను ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, గ్రామ జ్యోతి యువత సభ్యులు దేవి ప్రసాద్, యస్వంత్, నాగేష్, ఆనంద్, నిఖిల్, దరిణి, యామిని, శ్రావణి తదితరులతో పాటు చిన్నారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.