విజయవాడ సినీ రంగంలో స్వయంకృషితో అగ్రస్థానానికి ఎదిగి, ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేసుకున్న పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు.
చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలుగా మారినప్పుడే వాటికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు.
స్వయంకృషితో సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి, తన అభిమానుల ద్వారా సేవా భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. రక్తదాన శిబిరాలు, బ్లడ్ బ్యాంక్ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఆయన.. రాజకీయ ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు.
అభిమానం అంటే కేవలం జేజేలు కొట్టడం కాదు.. ఆ అభిమాన వ్యక్తి చూపిన మంచి మార్గాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన అభిమానం అని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో మానవతా విలువలను పెంపొందిస్తాయని అన్నారు.
జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ ఆధ్వర్యంలో వెంకట సాయి వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ నిర్వహించి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. రేలంగి బుజ్జి ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రదానం, పేదలకు అన్నదానం చేపట్టారు. చిరంజీవి తెలుగు యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్ ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
చిరంజీవి సేవా స్ఫూర్తితో అభిమానులు తమ అభిమానాన్ని సమాజ సేవగా మలచడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని సామినేని ఉదయభాను అన్నారు. అవసరంలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి చిరంజీవి అభిమానిని జనసేన పార్టీ తరఫున అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రివిజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, కందివలస అచ్చిత తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవి సేవా స్ఫూర్తితో జన్మదిన వేడుకలు.. ప్రజాసేవే నిజమైన అభిమానం! విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు.. అభిమానులను అభినందించిన సామినేని ఉదయభాను
విజయవాడ సినీ రంగంలో స్వయంకృషితో అగ్రస్థానానికి ఎదిగి, ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేసుకున్న పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలుగా మారినప్పుడే వాటికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. స్వయంకృషితో సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి, తన అభిమానుల ద్వారా సేవా భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. రక్తదాన శిబిరాలు, బ్లడ్ బ్యాంక్ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఆయన.. రాజకీయ ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. అభిమానం అంటే కేవలం జేజేలు కొట్టడం కాదు.. ఆ అభిమాన వ్యక్తి చూపిన మంచి మార్గాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన అభిమానం అని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో మానవతా విలువలను పెంపొందిస్తాయని అన్నారు. జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ ఆధ్వర్యంలో వెంకట సాయి వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ నిర్వహించి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. రేలంగి బుజ్జి ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రదానం, పేదలకు అన్నదానం చేపట్టారు. చిరంజీవి తెలుగు యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్ ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. చిరంజీవి సేవా స్ఫూర్తితో అభిమానులు తమ అభిమానాన్ని సమాజ సేవగా మలచడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని సామినేని ఉదయభాను అన్నారు. అవసరంలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి చిరంజీవి అభిమానిని జనసేన పార్టీ తరఫున అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రివిజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, కందివలస అచ్చిత తదితరులు పాల్గొన్నారు.

