Friday, 22 May 2026
  • Home  
  • ఘనంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు
- తిరుపతి

ఘనంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు

శ్రీ కాళహస్తి, మే 22, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విజ్ఞానగిరిపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కాసరం రమేష్ మాట్లాడుతూ, సుధీర్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలతో నిర్వహించాలని పిలుపునిచ్చారని తెలిపారు. గత రెండేళ్లలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సుధీర్ రెడ్డి విశేష కృషి చేశారని, దేవస్థానాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా చేశారని కొనియాడారు. అనుబంధ ఆలయాల జీర్ణోద్ధరణతో పాటు పలు సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. సుధీర్ రెడ్డికి ఆయురారోగ్యాలు, మరిన్ని ఉన్నత పదవులు కలగాలని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, కంటా రమేష్, వాకచర్ల గుర్రప్ప శెట్టి, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.