గౌరారం గ్రామపంచాయతీలో ఎస్‌బీఐ మంగళూరు బ్రాంచ్ మేనేజర్ సి.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రీ-కేవైసీ, డిజిటల్ లావాదేవీల భద్రతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారులు ఎవరితోనూ ఓటీపీలు, సీక్రెట్ పిన్ వివరాలు పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సకాలంలో క్రాప్ లోన్స్ రెన్యూవల్ చేసుకునే రైతులకు కేంద్రం తరఫున 3 శాతం వడ్డీ సబ్‌వెన్షన్ వస్తుందని చెప్పారు. రూ.1,000 తో రూ.20 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఓఎస్ తిమ్మగల ఆంజనేయులు, సర్పంచ్, బ్యాంకింగ్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

గౌరారంలో రీ-కేవైసీపై అవగాహన సదస్సు:ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్