పున్నమి ప్రతినిధి,పెనుమూరు జూలై 29
గురుపౌర్ణమి సందర్భంగా ఏకవీరా సేవా ఫౌండేషన్ వారి సహకారంతో పూజ్య ప్రతాప్ స్వామీజీ ఆద్వర్యంలో పాళ్యం కొత్తూరు వద్ద గల ప్రాచీన శివాలయం దగ్గర బుధవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. గణపతి పూజ
ఉదయం
ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీవల్లభ, శ్రీగురు పాదుకలపూజ, రుద్రాభిషేకం, గురుపూజ, ధ్యానం,
భజనలు, మంగళహారతి తదితర కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో స్వామీజీ గురుతత్వం, సనాతనధర్మంలో గురువుస్థానం, ఆధ్యాత్మిక జీవనవిధానం గురించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. గురువు చూపిన మార్గంలో నడవడం ద్వారా జీవితానికి
సార్థకత చేకూరుతుందని స్వామీజీ పేర్కొన్నారు. గురుపౌర్ణిమ ప్రాముఖ్యతను వివరిస్తూ భక్తులందరికీ ఆశీర్వచనాలు అందించారు. గురుపౌర్ణిమ భారతీయ ఆధ్యాత్మిక
సంప్రదాయంలో గురువుల
ను స్మరించి వారి ఆశీస్సులు పొందే పవిత్ర దినంగా భావించబడుతుందని స్వామీ జీ సూచించారు.
కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై
స్వామీజీ ఆశీస్సులు పొందారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నప్రసాద వితరణలో భక్తులందరూ పాల్గొన్నారు. స్వామివారి చేతులమీదుగా సాయంత్రం ధర్మజ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను భక్తులు అభినందించారు.


