Saturday, 5 September 2026
  • Home  
  • గణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు రౌడీషీటర్లపై నిరంతరం నిఘా: సీపీ సునీల్ దత్
- ఖమ్మం

గణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు రౌడీషీటర్లపై నిరంతరం నిఘా: సీపీ సునీల్ దత్

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, ప్రతి మండపం వద్ద భద్రతను పర్యవేక్షించాలని సూచించారు. నిమజ్జన మార్గాలు, ప్రదేశాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో తగినంత బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలన్నారు. ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దం, రెచ్చగొట్టే నినాదాలు, మద్యం సేవించి పాల్గొనడంపై నిఘా ఉంచాలని సూచించారు. అలాగే రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిపై ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని కోరారు.

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, ప్రతి మండపం వద్ద భద్రతను పర్యవేక్షించాలని సూచించారు.

నిమజ్జన మార్గాలు, ప్రదేశాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో తగినంత బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలన్నారు. ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దం, రెచ్చగొట్టే నినాదాలు, మద్యం సేవించి పాల్గొనడంపై నిఘా ఉంచాలని సూచించారు.

అలాగే రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిపై ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.