Friday, 1 May 2026
  • Home  
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో అడవి దున్నల సంచారం
- ఖమ్మం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో అడవి దున్నల సంచారం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో అడవి దున్నలు (ఇండియన్ బైసన్స్) సంచారం గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో ఇవి గ్రామాల సమీపానికి వచ్చి పంట పొలాల్లో తిరుగుతూ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో ఉండే ఈ దున్నలు నీటి కొరత, ఆహార సమస్యల కారణంగా బయటకు వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. సత్తుపల్లి మండలంలోని చంద్రాయపాలెం, రేగల్ల పాడు, యాతాల కుంట ప్రాంతాల్లో వీటి కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అడవి జంతువులను రెచ్చగొట్టకుండా, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో అడవి దున్నలు (ఇండియన్ బైసన్స్) సంచారం గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో ఇవి గ్రామాల సమీపానికి వచ్చి పంట పొలాల్లో తిరుగుతూ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో ఉండే ఈ దున్నలు నీటి కొరత, ఆహార సమస్యల కారణంగా బయటకు వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
సత్తుపల్లి మండలంలోని చంద్రాయపాలెం, రేగల్ల పాడు, యాతాల కుంట ప్రాంతాల్లో వీటి కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అడవి జంతువులను రెచ్చగొట్టకుండా, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.