Monday, 22 June 2026
  • Home  
  • ఖమ్మంలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ.. తల్లిదండ్రులపై భారం.. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి : బీజేపీ జిల్లా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు
- ఖమ్మం

ఖమ్మంలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ.. తల్లిదండ్రులపై భారం.. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి : బీజేపీ జిల్లా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు

ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని బీజేపీ జిల్లా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఖమ్మం జిల్లా పున్నమి రిపోర్టర్ పువ్వాడ నాగేంద్ర కుమార్ తో ఆచంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు వేల రూపాయల విలువైన పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను తప్పనిసరిగా అదే పాఠశాలల ద్వారా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. చిన్నారుల విద్య పేరుతో ₹3 వేల నుంచి ₹10 వేల వరకు పుస్తకాల ఖర్చు, అదనంగా యూనిఫాంలు, షూలు, బ్యాగులు, రవాణా, ప్రత్యేక కోచింగ్ ఫీజుల పేరుతో లక్షల రూపాయల భారం మోపుతున్నారని తెలిపారు. ఏడో తరగతి నుంచే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో ప్రత్యేక మెటీరియల్‌కు వేల రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నియంత్రణ నిబంధనలను అనేక పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయని, తల్లిదండ్రులు ప్రశ్నిస్తే విద్యార్థుల భవిష్యత్తును అడ్డుపెట్టుకుని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శించారు. విద్యాశాఖ అధికారులు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అధిక ఫీజులు, బలవంతపు పుస్తకాల విక్రయాలు, యూనిఫాం దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విద్య సేవగా ఉండాలి. వ్యాపారంగా కాదన్నారు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచుకునే విద్యా మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి అని ఆచంటి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు స్వీకరించి సమగ్ర విచారణ జరిపించాలని, అవసరమైతే బాధిత తల్లిదండ్రులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామని ఆచంటి కోటేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ని హెచ్చరించారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని బీజేపీ జిల్లా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు
ఖమ్మం జిల్లా పున్నమి రిపోర్టర్ పువ్వాడ నాగేంద్ర కుమార్ తో ఆచంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ

ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు వేల రూపాయల విలువైన పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను తప్పనిసరిగా అదే పాఠశాలల ద్వారా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. చిన్నారుల విద్య పేరుతో ₹3 వేల నుంచి ₹10 వేల వరకు పుస్తకాల ఖర్చు, అదనంగా యూనిఫాంలు, షూలు, బ్యాగులు, రవాణా, ప్రత్యేక కోచింగ్ ఫీజుల పేరుతో లక్షల రూపాయల భారం మోపుతున్నారని తెలిపారు.
ఏడో తరగతి నుంచే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో ప్రత్యేక మెటీరియల్‌కు వేల రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నియంత్రణ నిబంధనలను అనేక పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయని, తల్లిదండ్రులు ప్రశ్నిస్తే విద్యార్థుల భవిష్యత్తును అడ్డుపెట్టుకుని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శించారు.
విద్యాశాఖ అధికారులు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అధిక ఫీజులు, బలవంతపు పుస్తకాల విక్రయాలు, యూనిఫాం దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

విద్య సేవగా ఉండాలి. వ్యాపారంగా కాదన్నారు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచుకునే విద్యా మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి అని ఆచంటి కోటేశ్వరరావు స్పష్టం చేశారు.
ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు స్వీకరించి సమగ్ర విచారణ జరిపించాలని, అవసరమైతే బాధిత తల్లిదండ్రులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామని ఆచంటి కోటేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.