వరికుంటపాడు: మండలంలోని మహమ్మదాపురం పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు కిలారి మురళి ఆకస్మికంగా మృతి చెందడం పట్ల టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మురళి మృతి వార్త తెలుసుకున్న బొల్లినేని వెంకట రామారావు మహమ్మదాపురం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మురళి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు చండ్ర వెంకయ్య, చండ్ర ఉమామహేశ్వరరావు, కామేపల్లి వెంకటరత్నం, పావులూరి రవీంద్రబాబు, భోగినేని శ్రీనివాసులు తదితరులు పాల్గొని కిలారి మురళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కిలారి మురళి మృతి టీడీపీకి తీరని లోటు: బొల్లినేని వెంకట రామారావు
వరికుంటపాడు: మండలంలోని మహమ్మదాపురం పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు కిలారి మురళి ఆకస్మికంగా మృతి చెందడం పట్ల టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళి మృతి వార్త తెలుసుకున్న బొల్లినేని వెంకట రామారావు మహమ్మదాపురం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మురళి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చండ్ర వెంకయ్య, చండ్ర ఉమామహేశ్వరరావు, కామేపల్లి వెంకటరత్నం, పావులూరి రవీంద్రబాబు, భోగినేని శ్రీనివాసులు తదితరులు పాల్గొని కిలారి మురళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

