Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: శివాలయం సమీపంలో వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి: శివాలయం సమీపంలో వ్యక్తి మృతి

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

ఉదయగిరి: పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న అరుగుపై ఓ వ్యక్తి మృతిచెంది ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడిని ఏఎస్ పేటకు చెందిన జలీల్‌గా స్థానికులు గుర్తించారు. ఆయన ఉదయగిరిలోని ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది.

సమాచారం ప్రకారం.. శివాలయం సమీపంలోని అరుగు మీద జలీల్ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. మద్యానికి అలవాటు ఉండటంతోనే మృతి చెంది ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన మృతికి అసలు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు విచారణ చేపడితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *