Tuesday, 15 September 2026
  • Home  
  • కొవ్వూరు యువతకు భారీ జాబ్ మేళా
- తూర్పు గోదావరి

కొవ్వూరు యువతకు భారీ జాబ్ మేళా

తూర్పుగోదావరి జిల్లా, (పున్నమి ప్రతినిధి ) కొవ్వూరు: కొవ్వూరు నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం భీమవరం స్టేట్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో వివిధ ప్రైవేటు సంస్థలు, కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. ముఖ్యంగా చాగల్లు ఎస్‌ఈఆర్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమై, అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళాకు మొత్తం 13 ప్రముఖ కంపెనీలు హాజరై తమ సంస్థల్లోని ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం తదితర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత జాబ్ మేళాకు హాజరై తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహించడం ద్వారా నిరుద్యోగ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.

తూర్పుగోదావరి జిల్లా, (పున్నమి ప్రతినిధి ) కొవ్వూరు:
కొవ్వూరు నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం భీమవరం స్టేట్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ జాబ్ మేళాలో వివిధ ప్రైవేటు సంస్థలు, కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. ముఖ్యంగా చాగల్లు ఎస్‌ఈఆర్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమై, అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

జాబ్ మేళాకు మొత్తం 13 ప్రముఖ కంపెనీలు హాజరై తమ సంస్థల్లోని ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం తదితర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

కొవ్వూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత జాబ్ మేళాకు హాజరై తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందాలని కోరారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహించడం ద్వారా నిరుద్యోగ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.