Friday, 29 May 2026
  • Home  
  • నేరపల్లి గ్రామంలో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- E-పేపర్

నేరపల్లి గ్రామంలో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నేరపల్లి గ్రామంలో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పున్నమి న్యూస్ 29మే 2026 తెలంగాణ ఇంచార్జి నేరపల్లి గ్రామంలో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గొడ్డండ్ల హెలమత శ్రీ హరి .. ఉప సర్పంచ్ వెలగ వేణు గోపాల్ రెడ్డి మరియు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొని బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేసి, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కామినేని హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

నేరపల్లి గ్రామంలో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పున్నమి న్యూస్
29మే 2026
తెలంగాణ ఇంచార్జి

నేరపల్లి గ్రామంలో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గొడ్డండ్ల హెలమత శ్రీ హరి ..
ఉప సర్పంచ్ వెలగ వేణు గోపాల్ రెడ్డి మరియు,
గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొని బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేసి, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
కామినేని హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.