కొమ్మలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మహిళకు తీవ్ర గాయాలు
నెల్లూరు వెంగల్ రావు నగర్‌కు చెందిన ఎల్లమల సాయి (28) నాయుడుపేట నుంచి నెల్లూరుకు బైక్‌పై వస్తుండగా, మనుబోలు మండలం కొమ్మలపూడి రోడ్డు సమీపంలో కాఫీ డే ఎదురుగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న జ్యోతి (25), చిన్నారి గాయపడగా, జ్యోతికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. సమాచారం అందుకున్న మనుబోలు ఎస్‌ఐ శివ రాకేష్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంతో ఏర్పడిన ట్రాఫిక్‌ను పోలీసులు వేగంగా క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.


