Thursday, 6 August 2026
  • Home  
  • ప్రతి ఒక్కరికి కంటిచూపున ప్రసాదించడమే ఎం.వి. రావు ఫౌండేషన్ లక్ష్యం, గుణపాడు దళితవాడలో మెగా కంటే వైద్య శిబిరం,
- గూడూరు

ప్రతి ఒక్కరికి కంటిచూపున ప్రసాదించడమే ఎం.వి. రావు ఫౌండేషన్ లక్ష్యం, గుణపాడు దళితవాడలో మెగా కంటే వైద్య శిబిరం,

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 6 చిట్టమూరు మండలం, ప్రతి ఒక్కరికి నేత్ర సమస్యలు లేకుండా చూసి వారికి కంటి చూపును ప్రసాదించండి ఎంవి రావు ఫౌండేషన్ లక్ష్యం అని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ అన్నారు. గురువారం తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాడు దళితువాడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న సామెత ఆధారంగా ప్రతి ఒక్కరికి నేత్ర సమస్యలు లేకుండా ప్రతి గ్రామంలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించడమే తమ లక్ష్యాన్ని తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద వర్గాలకు అవసరమైన సదుపాయాలు కూడా తాము కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేతృత్వంలో నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ వి రమేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని హాజరైన ప్రజలందరికీ ఉచితంగా కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు. దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాల అత్యంత తక్కువ ధరకు, అదేవిధంగా కంటిలో శుక్లాలు ఉన్నవారికి ఉచితంగా తిరుపతి పట్టణంలోని వాసన ఐ కేర్ ఆసుపత్రి నందు ఆపరేషన్ నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేస్తామని లీలా మోహన్ కృష్ణ తెలిపారు. గుణపాడు గ్రామానికి చెందిన ప్రజలు విరివిగా హాజరై ఈ వైద్య శిబిరంలో తమ కంటే సమస్యలను వైద్యులకు తెలియజేసి వారి సూచనలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, మాజీ ఎంపిటిసి మస్తానయ్య, అంగన్వాడి టీచర్ నాగమణి, ఉపాధ్యాయిని జయలక్ష్మి, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 6 చిట్టమూరు మండలం,

ప్రతి ఒక్కరికి నేత్ర సమస్యలు లేకుండా చూసి వారికి కంటి చూపును ప్రసాదించండి ఎంవి రావు ఫౌండేషన్ లక్ష్యం అని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ అన్నారు.

గురువారం తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాడు దళితువాడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న సామెత ఆధారంగా ప్రతి ఒక్కరికి నేత్ర సమస్యలు లేకుండా ప్రతి గ్రామంలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించడమే తమ లక్ష్యాన్ని తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద వర్గాలకు అవసరమైన సదుపాయాలు కూడా తాము కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేతృత్వంలో నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ వి రమేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని హాజరైన ప్రజలందరికీ ఉచితంగా కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు.

దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాల అత్యంత తక్కువ ధరకు, అదేవిధంగా కంటిలో శుక్లాలు ఉన్నవారికి ఉచితంగా తిరుపతి పట్టణంలోని వాసన ఐ కేర్ ఆసుపత్రి నందు ఆపరేషన్ నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేస్తామని లీలా మోహన్ కృష్ణ తెలిపారు.

గుణపాడు గ్రామానికి చెందిన ప్రజలు విరివిగా హాజరై ఈ వైద్య శిబిరంలో తమ కంటే సమస్యలను వైద్యులకు తెలియజేసి వారి సూచనలను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, మాజీ ఎంపిటిసి మస్తానయ్య, అంగన్వాడి టీచర్ నాగమణి, ఉపాధ్యాయిని జయలక్ష్మి, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.