Sunday, 6 September 2026
  • Home  
  • కే.ఎస్. అగ్రహారంలో ఘనంగా మైసమ్మ తల్లి తిరణాలు
- తిరుపతి

కే.ఎస్. అగ్రహారంలో ఘనంగా మైసమ్మ తల్లి తిరణాలు

చిట్వేలు: మండలంలోని కే.ఎస్. అగ్రహారంలో శ్రీ మైసమ్మ తల్లి తిరణాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి హాజరయ్యారు. పాటూరి శ్రీనివాసులు రెడ్డి ఆహ్వానం మేరకు ఆయనతో పాటు ముక్కా వరలక్ష్మి, ముక్కా శిరీష పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, కస్తూరి విశ్వనాథ నాయుడు, కేకే చౌదరి, విశ్వేశ్వర నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు. తిరణాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి దర్శనం, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరణాలను విజయవంతం చేశారు.

చిట్వేలు: మండలంలోని కే.ఎస్. అగ్రహారంలో శ్రీ మైసమ్మ తల్లి తిరణాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి హాజరయ్యారు. పాటూరి శ్రీనివాసులు రెడ్డి ఆహ్వానం మేరకు ఆయనతో పాటు ముక్కా వరలక్ష్మి, ముక్కా శిరీష పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, కస్తూరి విశ్వనాథ నాయుడు, కేకే చౌదరి, విశ్వేశ్వర నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు. తిరణాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి దర్శనం, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరణాలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.