అక్రమ కేసులతో వేధిస్తున్నారు….
– బాధితుల ఆవేదన
–
ఖమ్మం, సెప్టెంబర్ 18:
అక్రమ కేసులతో కూసుమంచి ఎస్ఐ వేధిస్తున్నారని కూసుమంచి మండలం, కేసవాపురం గ్రామానికి చెందిన మందపల్లి శ్రీనివాసరావు, రజనీ, మందపల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు . ఖమ్మం లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు వేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన పోటు ప్రదీప్, పోటు తిరుమలరావు అనే ఇద్దరు వ్యక్తులు రాళ్ళు, కర్రలతో తమ భూమిలోకి వచ్చి గొడవ చేసారని, వారిపై పోలీసులకు పిర్యాదు పట్టించుకోలేదని తెలిపారు. పైగా తామే దాడి చేశామంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రదీప్, తిరుమలరావు మాపై కూసుమంచి పోలీసులకు ఫి ర్యాదు చేశారని తెలిపారు .
ఈ ఘటనపై తా ము ఉన్నతాధికారులైన డీజీపీకి 03.11.2025 న ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు..
ఈ విషయం తెలిసి, కక్ష సాధింపు చర్యగా కూసుమంచి ఎస్సై తమపై అక్రమ సెక్షన్లతో కేసు నమోదు చేసారని, ఇటీవల కోర్టు నుంచి ఈ కేసు గురించి ఛార్జిషీట్ వచ్చిందంటూ తమను స్టేషన్ పిలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తహశిల్దార్, సర్వేయర్ గ్రామానికి వచ్చి విచారణ చేసి, తమకు వ్యతిరేకంగా, ప్రదీప్ కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారని ఆరోపించారు. అబద్ధపు సంఖ్యలతో, ఎస్సారెస్పీ కాలువ ఉన్న భూమిని మట్టి రోడ్డుగా మాత్రమే చూపుతూ అధికారులు తప్పుడు నివేదికలు తయారు చేశారనీ ఆరోపించారు.
మాకు జరిగిన ఈ అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమ కేసులను తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.


