దుత్తలూరు మండల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను అందజేశారు. అనంతరం రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బైరవరం పంచాయతీలోని మూడు గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

దుత్తలూరులో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం