Tuesday, 30 June 2026
  • Home  
  • కూటమి పాలనలో దళితులు, గిరిజనులపై వేధింపులు- కాకాణి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కూటమి పాలనలో దళితులు, గిరిజనులపై వేధింపులు- కాకాణి

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అఘాయిత్యానికి గురైన ఎరుకుల మహిళ ను మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కావలి పట్టణంలో ఎరుకుల మహిళ పై జరిగిన దాడి తీవ్ర విచారకరం అని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి భరోసా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నాం బాధితురాలు చెప్పిన వివరాలు వింటుంటే అసలు మనం ఒక సభ్య సమాజంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు తలఎత్తుకుని తిరిగే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని కాకాణి ఆరోపించారు. కావలిలో ఒక గిరిజన (ST ఎరుకల కులానికి చెందిన) మహిళ కుటుంబంపై దాడి జరిగింది.సదరు మహిళను కులం పేరుతో దూషిస్తూ, జుట్టు పట్టుకుని వీధిలోకి లాగి, బట్టలు ఊడదీసి వివస్త్రను చేశారని, నిందితులు గా ఉన్నవాళ్లు ఆమెను కాళ్లతో, చేతులతో దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై.తన మానాన్ని కాపాడుకోవడానికి సదరు మహిళ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుందని కాకాణి, ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నిందితులే వెళ్లి రివర్స్‌లో బాధితులపై కేసు పెట్టి బాధితురాలి కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టారని గాయాలు, అవమానంతో బాధపడుతూ బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకును ఎందుకు తెచ్చారని ప్రశ్నించగా.నీ కొడుకుపై కేసు నమోదైంది… నిన్ను కొట్టిన విషయం బయటకు రాకూడదు” అని పోలీసులు బాధితురాలితో చెప్పడంతో కొట్టిన విషయం బయటకు రాకుండా ఉంటే, మీ కొడుకుపై ఎలాంటి కేసు లేకుండా పంపించేస్తాం” అని పోలీసులు కండిషన్ పెట్టారని ఆరోపించారు. ఒకవేళ కేసు పెడతామని భీష్మించుకుంటే, మీ కొడుకుపై గూండా యాక్ట్ పెడతామని, రౌడీ షీట్ తెరుస్తామని పోలీసులు బెదిరించి ఎరుకుల మహిళను భయపెట్టి, పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి, పోలీసులే ఒక కాంప్రమైజ్ డీడ్ (రాజీ పత్రం) రాశి ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, ఇకపై ఒకరి జోలికి ఒకరు పోమని బలవంతంగా సంతకం పెట్టించి కేసు క్లోజ్ చేశామని చెప్పిఅక్కడి నుంచి ఆమెను ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్లి వేలిముద్రలు వేయించి.ఆమె ఎస్టీ మహిళ అయినప్పటికీ, ఇస్లాం మతం స్వీకరించినట్లుగా ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఒక తప్పుడు సర్టిఫికేట్ సృష్టించారని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి లు తెలిపారు. వీరి వెంట పార్టీ క్యాడర్ భారీ ఎత్తున కచ్చేరి మిట్టకు చేరుకుంది.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అఘాయిత్యానికి గురైన ఎరుకుల మహిళ ను మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు.
కావలి పట్టణంలో ఎరుకుల మహిళ పై జరిగిన దాడి తీవ్ర విచారకరం అని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి భరోసా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .
ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నాం బాధితురాలు చెప్పిన వివరాలు వింటుంటే అసలు మనం ఒక సభ్య సమాజంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు తలఎత్తుకుని తిరిగే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని కాకాణి ఆరోపించారు.
కావలిలో ఒక గిరిజన (ST ఎరుకల కులానికి చెందిన) మహిళ కుటుంబంపై దాడి జరిగింది.సదరు మహిళను కులం పేరుతో దూషిస్తూ, జుట్టు పట్టుకుని వీధిలోకి లాగి, బట్టలు ఊడదీసి వివస్త్రను చేశారని, నిందితులు గా ఉన్నవాళ్లు ఆమెను కాళ్లతో, చేతులతో దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై.తన మానాన్ని కాపాడుకోవడానికి సదరు మహిళ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుందని కాకాణి, ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
దాడికి పాల్పడిన నిందితులే వెళ్లి రివర్స్‌లో బాధితులపై కేసు పెట్టి బాధితురాలి కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టారని గాయాలు, అవమానంతో బాధపడుతూ బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకును ఎందుకు తెచ్చారని ప్రశ్నించగా.నీ కొడుకుపై కేసు నమోదైంది… నిన్ను కొట్టిన విషయం బయటకు రాకూడదు” అని పోలీసులు బాధితురాలితో చెప్పడంతో
కొట్టిన విషయం బయటకు రాకుండా ఉంటే, మీ కొడుకుపై ఎలాంటి కేసు లేకుండా పంపించేస్తాం” అని పోలీసులు కండిషన్ పెట్టారని ఆరోపించారు.
ఒకవేళ కేసు పెడతామని భీష్మించుకుంటే, మీ కొడుకుపై గూండా యాక్ట్ పెడతామని, రౌడీ షీట్ తెరుస్తామని పోలీసులు బెదిరించి
ఎరుకుల మహిళను భయపెట్టి, పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి, పోలీసులే ఒక కాంప్రమైజ్ డీడ్ (రాజీ పత్రం) రాశి
ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, ఇకపై ఒకరి జోలికి ఒకరు పోమని బలవంతంగా సంతకం పెట్టించి కేసు క్లోజ్ చేశామని చెప్పిఅక్కడి నుంచి ఆమెను ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్లి వేలిముద్రలు వేయించి.ఆమె ఎస్టీ మహిళ అయినప్పటికీ, ఇస్లాం మతం స్వీకరించినట్లుగా ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఒక తప్పుడు సర్టిఫికేట్ సృష్టించారని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి లు తెలిపారు. వీరి వెంట పార్టీ క్యాడర్ భారీ ఎత్తున కచ్చేరి మిట్టకు చేరుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.