మండలంలోని అయ్యప్పరెడ్డిపాలెం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించే క్రమంలో ఎర్రగుంట్ల మాధవ్ (35) ప్రమాదానికి గురై మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సమయానికే మాధవ్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడు ఏఎస్‌పేట మండలం అబ్బాసాపేట గ్రామానికి చెందినవాడు. కలిగిరిలోని సాయి క్యాటరింగ్ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
సమాచారం అందుకున్న కలిగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


