Monday, 28 September 2026
  • Home  
  • *పీర్జాదిగూడ అన్నపూర్ణ కాలనీలో ఘనంగా గణేష్ శోభాయాత్ర* *ఉమా దేవి, శ్రీనివాస్ రెడ్డి దంపతులను రెండో సారి వరించిన లాంభోదరుడి ప్రసాదం*
- రంగారెడ్డి

*పీర్జాదిగూడ అన్నపూర్ణ కాలనీలో ఘనంగా గణేష్ శోభాయాత్ర* *ఉమా దేవి, శ్రీనివాస్ రెడ్డి దంపతులను రెండో సారి వరించిన లాంభోదరుడి ప్రసాదం*

మేడిపల్లి: పీర్జాదిగూడ అన్నపూర్ణ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ‘అన్నపూర్ణ కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వాహకులు గణనాథుని నిమజ్జన శోభాయాత్రను అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. రూ. 1,35,000లకు గణేష్ లడ్డూ కైవసం ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి ప్రసాదం (లడ్డూ) వేలం పాట భక్తుల కోలాహలం మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. స్థానిక ప్రముఖులు మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి – ఉమాదేవి దంపతులు రూ. 1,35,000/- లకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.కాగా, గత సంవత్సరం కూడా ఈ దంపతులే రూ. 1,18,000/-లకు వేలంలో లడ్డూను దక్కించుకోవడం విశేషం. వరుసగా రెండో ఏడాది కూడా స్వామివారి దివ్య ప్రసాదాన్ని కైవసం చేసుకోవడం పట్ల మలి పెద్ది శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ, గణనాథుని ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. గెలుపొందిన లడ్డు ప్రసాదాన్ని పంట పొలాలలో చల్లుకోవడం మాకు ఎంతో శుభదాయకం అని వారు తెలిపారు.శోభాయాత్ర పొడవునా భక్తుల భజనలు, డప్పు వాయిద్యాలు, యువకుల నృత్యాలతో అన్నపూర్ణ కాలనీ మార్మోగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మేడిపల్లి: పీర్జాదిగూడ అన్నపూర్ణ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ‘అన్నపూర్ణ కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వాహకులు గణనాథుని నిమజ్జన శోభాయాత్రను అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.
రూ. 1,35,000లకు గణేష్ లడ్డూ కైవసం
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి ప్రసాదం (లడ్డూ) వేలం పాట భక్తుల కోలాహలం మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. స్థానిక ప్రముఖులు మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి – ఉమాదేవి దంపతులు రూ. 1,35,000/- లకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.కాగా, గత సంవత్సరం కూడా ఈ దంపతులే రూ. 1,18,000/-లకు వేలంలో లడ్డూను దక్కించుకోవడం విశేషం. వరుసగా రెండో ఏడాది కూడా స్వామివారి దివ్య ప్రసాదాన్ని కైవసం చేసుకోవడం పట్ల మలి పెద్ది శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ, గణనాథుని ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. గెలుపొందిన లడ్డు ప్రసాదాన్ని పంట పొలాలలో చల్లుకోవడం మాకు ఎంతో శుభదాయకం అని వారు తెలిపారు.శోభాయాత్ర పొడవునా భక్తుల భజనలు, డప్పు వాయిద్యాలు, యువకుల నృత్యాలతో అన్నపూర్ణ కాలనీ మార్మోగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.