Sunday, 27 September 2026
  • Home  
  • పాలగుమ్మిలో ప్లాస్టిక్‌కు చరమగీతం.. స్టీల్ పాత్రల వినియోగానికి శ్రీకారం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పాలగుమ్మిలో ప్లాస్టిక్‌కు చరమగీతం.. స్టీల్ పాత్రల వినియోగానికి శ్రీకారం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పాలగుమ్మి గ్రామస్తులు పర్యావరణ పరిరక్షణకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులను వినియోగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామస్తులు వెయ్యి స్టీల్ ప్లేట్లు, 600 స్టీల్ గ్లాసులు కొనుగోలు చేశారు. గ్రామంలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా అవసరమైన పాత్రలను గ్రామం నుంచి తీసుకెళ్లి వినియోగించుకుని, కార్యక్రమం అనంతరం తిరిగి అప్పగించే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్, పేపర్ వస్తువుల వల్ల పెరుగుతున్న చెత్తను తగ్గించడంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని గ్రామస్తులు తెలిపారు. పాలగుమ్మి ప్రజల నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలుస్తూ, ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా మారుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.