Friday, 1 May 2026
  • Home  
  • కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటమే మార్గం – సిపిఐ నాయకులు
- ఆంధ్రప్రదేశ్

కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటమే మార్గం – సిపిఐ నాయకులు

ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించిన సిపిఐ నెల్లూరు రూరల్ మండల నాయకులు…… ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలోని, కొండ్లపూడి, కొమ్మరపూడి , సౌత్ మోపూర్, మొగళ్లపాలెం, కందమూరు, పాత వెల్లంటి, కొత్త వెల్లంటి గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సౌత్ మోపూర్, గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు చల్ల నరసయ్య జెండాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ మండలం సిపిఐ కార్యదర్శి కొప్పోలు చిన్న అంకయ్య ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లు సీనయ్య పాల్గొన్నారు.కార్మిక, కర్షక వర్గాల పోరాట స్ఫూర్తిని ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గ హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులను స్మరించారు. నేటి పరిస్థితుల్లో కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య పోరాటాల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. కార్మిక చట్టాల పరిరక్షణ, ఉపాధి భద్రత, కూలీల సంక్షేమం కోసం సిపిఐ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. మండలంలోని గ్రామాలలో ఎర్రజెండాలు రెపరెపలాడుతూ మేడే వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. కార్యక్రమాలలో నెల్లూరు రూరల్ మండల సహాయ కార్యదర్శి వై ఆదినారాయణ, మాట్లాడుతూ ఎర్రజెండా నాయకత్వంలో సౌత్ మోపూర్ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఇక్కడ లేని వసతులు ఎక్కడ లేవని నెల్లూరు జిల్లాకే ఆదర్శ గ్రామంగా సౌత్ మోపూర్ గ్రామం నిలిచిందన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ (బిజెపి కోటమీ ప్రభుత్వం )ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలమైంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తుంగలో తొక్కి దేశంలో వలసదారుల సంఖ్య పెరగడమే కాకుండా ఆర్థిక విధ్వంసాలు సృష్టిస్తూ ప్రాంతీయ పార్టీల పైన పక్షపాతం చూపిస్తూ రాజకీయ కక్ష పూరితమైన చర్యలు తప్ప దేశ అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించడంలో పూర్తి విఫలమైందని చెప్పుకోవచ్చు అన్నారు. ఈ డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజిన్లు ఉన్నందున దేశాన్ని ఎటువైపులాకు వెళ్తున్నారో ప్రజలకి అర్థం కాని పరిస్థితిలో ఉందన్నారు. కావున ఎర్ర సైనికులంతా కలిసి ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నెల్లూరు రూరల్ విషయానికొస్తే ప్రజాప్రతినిధులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని శంకుస్థాపనలు చేస్తున్నారని వాటికి సంబంధించి శంకుస్థాపనలే కాకుండా పని విధానాన్ని కూడా చూపించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. లేని పక్షంలో సిపిఐ గా నెల్లూరు రూరల్ సమస్యలను తీసుకొని ఎర్రజెండా పార్టీలను కలుపుకొని నెల్లూరు రూరల్ లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే విధంగా కార్యచరణ తీసుకొని పోరాడుతా ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నెల్లూరు రూరల్ మండలం సమితి సభ్యుడు పముజల హరి, సౌత్ మోపూర్ గ్రామ శాఖ కార్యదర్శి శ్రీరాములు, మస్తానయ్య ,చెంచురామయ్య, తుళ్లూరు శేషయ్య, రాంబాబు, మారం సుబ్బారావు, వెంకటరమణయ్య, నాగరత్నం, చిన్న వెంకయ్య ,తదితర నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మేడే కార్యక్రమానికి జయప్రదం చేశారు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించిన సిపిఐ నెల్లూరు రూరల్ మండల నాయకులు……
ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలోని, కొండ్లపూడి, కొమ్మరపూడి , సౌత్ మోపూర్, మొగళ్లపాలెం, కందమూరు, పాత వెల్లంటి, కొత్త వెల్లంటి గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సౌత్ మోపూర్, గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు చల్ల నరసయ్య జెండాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ మండలం సిపిఐ కార్యదర్శి కొప్పోలు చిన్న అంకయ్య ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లు సీనయ్య పాల్గొన్నారు.కార్మిక, కర్షక వర్గాల పోరాట స్ఫూర్తిని ఘనంగా స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గ హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులను స్మరించారు. నేటి పరిస్థితుల్లో కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య పోరాటాల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. కార్మిక చట్టాల పరిరక్షణ, ఉపాధి భద్రత, కూలీల సంక్షేమం కోసం సిపిఐ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు.
మండలంలోని గ్రామాలలో ఎర్రజెండాలు రెపరెపలాడుతూ మేడే వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. కార్యక్రమాలలో నెల్లూరు రూరల్ మండల సహాయ కార్యదర్శి వై ఆదినారాయణ, మాట్లాడుతూ ఎర్రజెండా నాయకత్వంలో సౌత్ మోపూర్ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఇక్కడ లేని వసతులు ఎక్కడ లేవని నెల్లూరు జిల్లాకే ఆదర్శ గ్రామంగా సౌత్ మోపూర్ గ్రామం నిలిచిందన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ (బిజెపి కోటమీ ప్రభుత్వం )ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలమైంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తుంగలో తొక్కి దేశంలో వలసదారుల సంఖ్య పెరగడమే కాకుండా ఆర్థిక విధ్వంసాలు సృష్టిస్తూ ప్రాంతీయ పార్టీల పైన పక్షపాతం చూపిస్తూ రాజకీయ కక్ష పూరితమైన చర్యలు తప్ప దేశ అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించడంలో పూర్తి విఫలమైందని చెప్పుకోవచ్చు అన్నారు. ఈ డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజిన్లు ఉన్నందున దేశాన్ని ఎటువైపులాకు వెళ్తున్నారో ప్రజలకి అర్థం కాని పరిస్థితిలో ఉందన్నారు. కావున ఎర్ర సైనికులంతా కలిసి ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నెల్లూరు రూరల్ విషయానికొస్తే ప్రజాప్రతినిధులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని శంకుస్థాపనలు చేస్తున్నారని వాటికి సంబంధించి శంకుస్థాపనలే కాకుండా పని విధానాన్ని కూడా చూపించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. లేని పక్షంలో సిపిఐ గా నెల్లూరు రూరల్ సమస్యలను తీసుకొని ఎర్రజెండా పార్టీలను కలుపుకొని నెల్లూరు రూరల్ లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే విధంగా కార్యచరణ తీసుకొని పోరాడుతా ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నెల్లూరు రూరల్ మండలం సమితి సభ్యుడు పముజల హరి, సౌత్ మోపూర్ గ్రామ శాఖ కార్యదర్శి శ్రీరాములు, మస్తానయ్య ,చెంచురామయ్య, తుళ్లూరు శేషయ్య, రాంబాబు, మారం సుబ్బారావు, వెంకటరమణయ్య, నాగరత్నం, చిన్న వెంకయ్య ,తదితర నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మేడే కార్యక్రమానికి జయప్రదం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.