ఖమ్మం: ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యామ్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ, చెక్‌డ్యామ్ నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యామ్‌పై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని, ప్రజలకు నిజాలు తెలియజేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయడం మానుకుని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా లైబ్రరీ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యారగర్ల హనుమంతరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇన్‌చార్జి కమతం మురళి, బాలగంగాధర్ తిలక్, బాణాల లక్ష్మణ్, కొప్పెర ఉపేందర్, రుద్రగాని ఉపేందర్, ప్రసన్న కృష్ణ, రవి నాయక్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



