కలిగిరి మండలం దూబగుంటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దూబగుంట ఎస్టీ కాలనీకి చెందిన తలపల రామారావు (50) శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో వర్షం కురుస్తుండటంతో సమీపంలోని ఓ పాకలోకి వెళ్లి వర్షం నుంచి తలదాచుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా పిడుగు పడటంతో రామారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పిడుగుపాటు ధాటికి ఆయన శరీరం కాలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కలిగిరి: పిడుగుపాటుకు వ్యక్తి మృతి