శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మున్సిపాలిటీ నూతన కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డిని బుధవారం శ్రీరాంనగర్, గజేంద్రనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యాధికారులు డాక్టర్ బాలు, డాక్టర్ గిరిజా ప్రకాశం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమ విజయవంతానికి మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చూడాలని చర్చించారు. అలాగే రానున్న వర్షాకాలాన్ని పురస్కరించుకుని పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, తాగునీటి పరిశుభ్రత, డ్రైనేజీల క్లీనింగ్, మరియు సకాలంలో చెత్త తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టి, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు రెండు శాఖలు కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆసుపత్రి సిబ్బంది కూడా పాల్గొన్నారు.

కమిషనర్‌ను కలిసిన వైద్యాధికారులు- వర్షాకాల ముందస్తు చర్యలపై చర్చ