ఎరుకువానిపాలెం, అనకాపల్లి మండలం – పున్నమి ప్రతినిధి
ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎరుకువానిపాలెం ఎం.పి.యు.పి. పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, ఏపీ జీవ వైవిధ్య సంరక్షణ అవార్డు గ్రహీత కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాధాన్యతను వివరించారు. అనంతరం విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా డా. కొణతాల రామలింగస్వామి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కొణతాల లక్ష్మీ పార్వతి విరాళంగా అందించిన “సేవ్ ఎర్త్” విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. పాఠశాల కమిటీ చైర్మన్ అరెగల శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు కె.ఎన్. మూర్తి, బి.వై.వై.ఎస్. కృష్ణారావు, పి. జయశ్రీ, ఎస్. సుజాత, జి. ఉమా, డి. శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు. “ఓజోన్ను కాపాడుదాం–భూమిని రక్షిద్దాం” అంటూ నినాదాలు చేశారు.


