ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక మంత్రుల పనితీరును మరోసారి సమీక్షించి భారీగా మార్పులు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్ విస్తరణలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్ర మంత్రివర్గంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిపి 25 మంది మంత్రులు ఉండగా, ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు పనితీరు ఆశించిన స్థాయిలో లేని కొందరి శాఖలు మార్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
అయితే అందరి దృష్టి ప్రధానంగా హోంశాఖపైనే ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై విమర్శలు రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా గతంలో హోంశాఖ పనితీరుపై వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణలో హోంశాఖను ప్రస్తుత మంత్రి నుంచి మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈసారి మహిళకు బదులుగా పురుషుడికి, లేదా మిత్రపక్షానికి ఈ కీలక శాఖ అప్పగించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయితే తుది నిర్ణయం మాత్రం మరికొన్ని నెలల్లోనే వెలువడే అవకాశం ఉంది.

ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. హోంశాఖ ఎవరికి?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక మంత్రుల పనితీరును మరోసారి సమీక్షించి భారీగా మార్పులు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్ విస్తరణలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్ర మంత్రివర్గంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిపి 25 మంది మంత్రులు ఉండగా, ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు పనితీరు ఆశించిన స్థాయిలో లేని కొందరి శాఖలు మార్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే అందరి దృష్టి ప్రధానంగా హోంశాఖపైనే ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై విమర్శలు రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా గతంలో హోంశాఖ పనితీరుపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణలో హోంశాఖను ప్రస్తుత మంత్రి నుంచి మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈసారి మహిళకు బదులుగా పురుషుడికి, లేదా మిత్రపక్షానికి ఈ కీలక శాఖ అప్పగించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయితే తుది నిర్ణయం మాత్రం మరికొన్ని నెలల్లోనే వెలువడే అవకాశం ఉంది.

