
(పున్నమి రిపోర్టర్) అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఏటికొప్పాక హస్తకళ ఇతివృత్త ఉద్యానవనానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గారు.. చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఎమ్మెల్యే ఏటికొప్పాక హస్తకళాకారుల పనితీరును పరిశీలించారు. కళాకారులు తయారు చేస్తున్న లక్క బొమ్మలు, సహజ రంగుల వినియోగం, సంప్రదాయ హస్తకళా విధానాలను పరిశీలించి వివరాలు ఎమ్మెల్యే గారు. తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గారు.. మాట్లాడుతూ.. ఏటికొప్పాక హస్తకళలకు ప్రపంచస్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. ఏటికొప్పాక లక్క బొమ్మలకు పద్మశ్రీ, జాతీయ స్థాయి అవార్డులు రావడం గ్రామానికి, కళాకారులకు గర్వకారణమన్నారు. ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగించడం ఏటికొప్పాక కళాకారుల ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ ఉద్యానవన నిర్మాణానికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఏటికొప్పాక గ్రామానికి, హస్తకళాకారులకు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చే గొప్ప అవకాశాన్ని కల్పించారని అన్నారు. ఏటికొప్పాకలో సుమారు 10 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఈరోజు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో హస్తకళాకారుల సంక్షేమం, ఆరోగ్యం, జీవనోపాధి, ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హస్తకళల ప్రదర్శన, చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏటికొప్పాక లక్క బొమ్మలకు మరింత మార్కెట్ కల్పించి, ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రాచుర్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏటికొప్పాకలోని హస్తకళా హబ్, థీమ్ పార్క్ అభివృద్ధితో పాటు సమీప ప్రాంతంలో రిసార్ట్ ఏర్పాటు, లెఫ్ట్ కెనాల్‌కు అనుమతులు తీసుకుని బోటు షికారు వంటి పర్యాటక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయడానికి సంబంధిత శాఖలతో చర్చిస్తున్నామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏటికొప్పాక లక్క బొమ్మలు, హస్తకళల అభివృద్ధిపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని, ప్రభుత్వ ప్రోత్సాహంతో హస్తకళాకారులకు మంచి రోజులు రాబోతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటికొప్పాక లక్క బొమ్మలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్న ఆయన, ఏటికొప్పాకను భవిష్యత్తులో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళా హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. బండమ్మతల్లి ఆశీస్సులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి, ఏటికొప్పాక కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ ప్రజలు యువకులు కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు….

