నందలూరు మండలంలో ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. మండలంలోని వ్యవసాయ చెక్‌పోస్ట్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టి, వాహనదారులకు రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ లేదా ఉపయోగిస్తూ వాహనాలు నడపరాదని సూచించారు. అలాగే అధిక వేగంతో వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.


