సరే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో జీవనశైలి మారిపోయింది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన శైలిలో భోజనానికి తగినంత సమయం కూడా కేటాయించకుండా సరిగ్గా నమలకుండా హడావుడిగా భోజనం చేయడం జరుగుతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
భోజనం విషయంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు:
ఆహారాన్ని కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ముగించకూడదు.భోజనానికి కనీసం 20 నుంచి 30 నిమిషాలు కేటాయించాలి.నెమ్మదిగా, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయడం వల్ల మనసుకు, శరీరానికి ప్రశాంతత లభిస్తుంది.ప్రతి ముద్దను 20 నుంచి 30 సార్లు నమలాలి గట్టి పదార్థాలను మరింత ఎక్కువ సార్లు నవ్వలాలి. నోటిలోనే ఆహారం మెత్తని పేస్ట్‌లా మారేలా బాగా నమలాలి.ఇది జీర్ణవ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది.
ఈ పద్ధతి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఆహారం నోటిలోనే లాలాజలంతో కలిసి మెత్తగా మారడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్ మరియు ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
బరువు నియంత్రణలో ఉంటుంది: మనం తింటున్నప్పుడు కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. నెమ్మదిగా తినడం వల్ల అతిగా తినడాన్ని (Overeating) సహజంగానే నివారించవచ్చు.
పోషకాలు అందుతాయి: ఆహారం చిన్న భాగాలుగా విడిపోవడం వల్ల శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తు
ఆహారమే ఔషధం” – భోజనం చేసేటప్పుడు టీవీలు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ, కేవలం తిండిపై దృష్టి పెట్టి ఆస్వాదిస్తూ తినండి!

