Tuesday, 28 April 2026
  • Home  
  • ఎర్రచందనం స్మగ్లర్ల పైశాచికత్వం.. విలేకరి హత్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం – శివమూర్తి
- తిరుపతి

ఎర్రచందనం స్మగ్లర్ల పైశాచికత్వం.. విలేకరి హత్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం – శివమూర్తి

నిజాలను నిర్భయంగా రాసినందుకు వీ.కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని కిరాతకంగా హత్య చేసిన నరహంతకుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీ.కోట మండలం కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉండటంతో అక్కడ నిరంతరం అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ జరుగుతుంటాయని శివమూర్తి పేర్కొన్నారు. వాటిపై నిఘా ఉంచి వార్తలు రాస్తున్న జగన్మోహన్ రెడ్డి, నెల క్రితం ఎర్రచందనం స్మగ్లింగ్‌పై రాసిన కథనం స్మగ్లర్లలో కక్ష పెంచిందని తెలిపారు. ఈ క్రమంలోనే రౌడీ షీటర్ తమీమ్ పక్కా పథకం ప్రకారం విలేకరిని నడిబజార్లో వేటాడి, కత్తులతో నరికి చంపడం అత్యంత పైశాచికమని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం: ఇలాంటి నరహంతకులను ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించకూడదని, వారిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని పోలీసు అధికారులను కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జర్నలిస్ట్ సంఘాలను ఏకం చేసి భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రక్షణ చట్టాల అమలుపై విజ్ఞప్తి: జర్నలిస్టుల భద్రత కోసం చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేకరులకు రక్షణ కల్పించడంలో వైఫల్యాలు ఎదురైతే సహించేది లేదని, నరహంతకులకు శిక్ష పడే వరకు ఐక్యమత్యంతో పోరాడతామని శివమూర్తి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.