శ్రీకాళహస్తి, (ప్రతినిధి): చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు గళమెత్తారు. శనివారం సాయంత్రం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ నేతృత్వంలో స్థానిక గాంధీ విగ్రహం నుండి నాలుగు మాడవీధుల గుండా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్న విలేకరులు, వన్ టౌన్ సిఐ ప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ వ్యాఖ్యలు ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, ఇలా దుర్మార్గమైన ఆలోచనలతో తోటి మనిషిని చంపడం అత్యంత బాధాకరం. జగన్మోహన్ రెడ్డి హత్య జర్నలిస్టు లోకానికే తీరని లోటు. నిందితులను ప్రభుత్వం తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలి. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సభ్యులు, వివిధ పత్రికల మరియు టీవీ ఛానళ్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్మోహన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.

జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు – ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్