శ్రీకాళహస్తి, ఏప్రిల్ 27 (పున్నమి టెంపుల్ న్యూస్( : శ్రీకాళహస్తి మండలం వి.యం.పల్లికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుమారస్వామి సోదరుడు, ఏపీ హైకోర్టు డెప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు ఆకస్మిక మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం వి.యం.పల్లిలోని పొన్నారావు నివాసానికి చేరుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన అత్తమ్మ సామాను అనసూయమ్మ, కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుమారస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొన్నారావు మరణం పార్టీకి, న్యాయ రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తీశ్వరాలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పసల సురేష్, పసల సుమతి, శ్రీవారి సురేష్ తదితర నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

అడ్వొకేట్ పొన్నారావు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంతాపం