ఖమ్మం, జులై
(పున్నమి న్యూస్)
ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 5.210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య పర్యవేక్షణలో చేపట్టిన ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణ, ఎస్‌ఐలు జయశ్రీ, సాయిబాబా తదితర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.


