అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో అరకులోయ మండలంలో వర్షం కురుస్తూనే ఉంది. వర్షాలతో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ వద్ద కూడా కస్టమర్లు లేక బోసిపోయాయి. ఎడతెరపి లేని వర్షం కారణంగా సాధారణ జనజీవనం మందగించింది.
Uploaded Video:

