కొవ్వూరు/తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 23: మండుతున్న ఎండలు, భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.
ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడైనా పైపులైన్ల లీకేజీలు, మోటార్ల లోపాలు ఉన్నట్లయితే వెంటనే గుర్తించి మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల దాహార్తి తీర్చడం ప్రభుత్వ తొలి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల వద్ద దాతలు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఎండల తీవ్రతపై అప్రమత్తం.. తాగునీటి సమస్య రాకుండా చర్యలు : ఎమ్మెల్యే ముప్పిడి
కొవ్వూరు/తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 23: మండుతున్న ఎండలు, భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా పైపులైన్ల లీకేజీలు, మోటార్ల లోపాలు ఉన్నట్లయితే వెంటనే గుర్తించి మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల దాహార్తి తీర్చడం ప్రభుత్వ తొలి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల వద్ద దాతలు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

