కేరళలోని చలకుడి అటవీ విభాగ పరిధిలో 273 టేకు చెట్లను అక్రమంగా నరికి విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రహదారి విస్తరణ పనుల పేరుతో చెట్లను తొలగించి వాటిని తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థకు విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపరిహారం వసూలు చేయాలని దర్యాప్తు నివేదిక సూచించింది.

చలకుడిలో 200కుపైగా టేకు చెట్లు అక్రమంగా నరికివేత