ఉదయగిరి: దాసరిపల్లి–సోమలరేగడ హైవే వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి నుంచి ఉదయగిరి వైపు గన్నేపల్లి మాజీ సర్పంచ్ నెల్లూరు వెంకటస్వామి కారులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డును దాటుతున్న గేదెలను తప్పించేందుకు ప్రయత్నించగా.. కారు ఓ దూడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూడ అక్కడికక్కడే మృతి చెందింది. మరో గేదె తీవ్రంగా గాయపడింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వెంకటస్వామికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంతో హైవేపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు గాయపడిన గేదెకు చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు.

ఉదయగిరి హైవేపై గేదెల బీభత్సం.. కారు ముందు భాగం ధ్వంసం