ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ తెలిపారు. ఆసుపత్రికి నూతన నేమ్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రోగులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు బోరు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోగులు క్రమపద్ధతిలో క్యూ లో నిలబడేందుకు స్టీల్ రాడ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టామని తెలిపారు. అభివృద్ధి పనులతో ఆసుపత్రి ప్రాంగణం మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు రోగులకు ఇబ్బందులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సిబ్బంది సహకారంతో మిగిలిన అవసరమైన పనులను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అవసరమైన మరమ్మతులు, పారిశుధ్య చర్యలు కూడా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు అని తెలిపారు.

ఉదయగిరి : సీహెచ్సీలో అభివృద్ధి పనులు