ఉదయగిరి: నియోజకవర్గంలో శనివారం నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు మంత్రులు, ఎంపీ హాజరుకానున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ క్యాంపు కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రులు వాసంశెట్టి సుభాష్, ఫరూక్ ఉదయగిరికి రానున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వారి పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రులు, ఎంపీ పరిశీలించనున్నారు. అనంతరం స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు. పర్యటనకు సంబంధించి అధికారులు, పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీ పర్యటనపై స్థానికంగా ఆసక్తి నెలకొంది

ఉదయగిరికి రేపు మంత్రులు, ఎంపీ రాక