బిక్కవోలు పున్నమి ప్రతినిధి . జనవరి 15.
బలభద్రపురం పంచాయతీ కార్యదర్శులపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుని ఫిర్యాదు పై చర్య తీసుకొమ్మని ఎస్సైని ఆదేశించిన జిల్లా కలెక్టర్.
మరణించిన భార్య మరణ ధ్రువీకరణ పత్రాన్ని భర్తకి ఇవ్వకుండా ఆమెకి వారసులు కాని ఇద్దరికి ఇచ్చిన బలభద్రపురం కార్యదర్శులు నిర్వాకం ఇది. వివరాల్లోకి వెళితే, తన భార్య కోనాల పార్వతి గత సంవత్సరం నవంబర్ 25న మరణించిన విషయాన్ని ఆమె భర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు కోనాల వెంకటరెడ్డి గ్రామపంచాయతీకి తెలియపరిచారు. అయితే ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని వెంకటరెడ్డికి ఇవ్వకుండా, చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ వారసులు కాని ఆమె సోదరుడు వెలగల అచ్యుత రామారెడ్డికి అప్పటి కార్యదర్శి పి అచ్చియ్య చౌదరి ఇవ్వడం విశేషం. చౌదరి స్థానంలో తదుపరి కార్యదర్శిగా వచ్చిన గొంగల అశోక్ కుమార్ కూడా భర్త అయిన వెంకటరెడ్డికి ఇవ్వకుండా మరణించిన పార్వతికి మొదటి భర్త కర్రి వెంకటరెడ్డి (లేటు) యొక్క మొదటి భార్య కుమారుడు, తాపేశ్వరం గ్రామపంచాయతీ కార్యదర్శి అయిన కర్రి వెంకట చక్రధరరెడ్డికి ఇవ్వడం చేసారని విశ్రాంత ఉపాధ్యాయుడు ఒక ప్రకటనలో ఆరోపించారు. భర్తగా తాను తన భార్య మరణ ధ్రువీకరణ పత్రంను ఆర్.టి.ఐ తో సహా నాలుగు సార్లు దరఖాస్తు చేసినా కార్యదర్శి అశోక్ వాటిని బేఖాతరు చేశారని తెలిపారు. తన భార్య ఆస్తులను అక్రమంగా కాజేయాలనే దురుద్దేశ్యంతో ఉన్న చక్రధరరెడ్డి, అచ్యుత రామారెడ్డిలతో పంచాయితీ కార్యదర్శులు ఇద్దరూ కుమ్మక్కయ్యారని వెంకటరెడ్డి ఆరోపించారు. తన ఆర్టిఐ దరఖాస్తుకు బిక్కవోలు మండల అభివృద్ధి అధికారి స్పందిస్తూ తక్షణం పార్వతి మరణ ధ్రువీకరణ పత్రమును భర్త అయిన తనకు ఇమ్మని డిసెంబర్ 29న ఆదేశించినా, కార్యదర్శి అశోక్ సదరు ఆదేశాన్ని సైతం బేఖాతరు చేశారన్నారు. చివరకు స్పందనలో కలెక్టర్ కి తాను నివేదించగా కలెక్టర్ ఆదేశంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 9వ తేదీన తన భార్య మరణ ధ్రువీకరణ పత్రమును ఇచ్చారని ఆయన తెలిపారు. మండల అభివృద్ధి అధికారి ఆదేశాన్ని కూడా ఖాతరు చేయకపోవడానికి కారణం, వారసులు కాని వారికి తామిచ్చిన మరణ ధ్రువీకరణ పత్రంతో వారిలో ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందే విధంగా వారికి తగినంత సమయం ఇచ్చే దురుదేశ్యంతోనే కార్యదర్శులు కాలయాపన చేస్తూ వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారసులు కాని వారితో నేరపూరిత కుట్రలో భాగస్వాములు అయి కర్తవ్య నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్య వైఖరితో తప్పుడు సమాచారంతో రెవెన్యూ శాఖను మోసగించి, వారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందేందుకు వారితో కుమ్మక్కైన పూర్వ, ప్రస్తుత కార్యదర్శులతో పాటు సదరు నలుగురు కుట్రదారులపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కోనాల వెంకటరెడ్డి క్రిమినల్ కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు పై తగు విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ బిక్కవోలు సబ్ ఇన్స్పెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రకటన తో పాటు ఉన్నతధికారులు జారీ చేసిన ఆదేశాల వివరాలు కూడా వెంకటరెడ్డి మీడియా కు అందించారు.

ఇదెక్కడి న్యాయం. వాపోయిన వెంకటరెడ్డి
బిక్కవోలు పున్నమి ప్రతినిధి . జనవరి 15. బలభద్రపురం పంచాయతీ కార్యదర్శులపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని ఫిర్యాదు పై చర్య తీసుకొమ్మని ఎస్సైని ఆదేశించిన జిల్లా కలెక్టర్. మరణించిన భార్య మరణ ధ్రువీకరణ పత్రాన్ని భర్తకి ఇవ్వకుండా ఆమెకి వారసులు కాని ఇద్దరికి ఇచ్చిన బలభద్రపురం కార్యదర్శులు నిర్వాకం ఇది. వివరాల్లోకి వెళితే, తన భార్య కోనాల పార్వతి గత సంవత్సరం నవంబర్ 25న మరణించిన విషయాన్ని ఆమె భర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు కోనాల వెంకటరెడ్డి గ్రామపంచాయతీకి తెలియపరిచారు. అయితే ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని వెంకటరెడ్డికి ఇవ్వకుండా, చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ వారసులు కాని ఆమె సోదరుడు వెలగల అచ్యుత రామారెడ్డికి అప్పటి కార్యదర్శి పి అచ్చియ్య చౌదరి ఇవ్వడం విశేషం. చౌదరి స్థానంలో తదుపరి కార్యదర్శిగా వచ్చిన గొంగల అశోక్ కుమార్ కూడా భర్త అయిన వెంకటరెడ్డికి ఇవ్వకుండా మరణించిన పార్వతికి మొదటి భర్త కర్రి వెంకటరెడ్డి (లేటు) యొక్క మొదటి భార్య కుమారుడు, తాపేశ్వరం గ్రామపంచాయతీ కార్యదర్శి అయిన కర్రి వెంకట చక్రధరరెడ్డికి ఇవ్వడం చేసారని విశ్రాంత ఉపాధ్యాయుడు ఒక ప్రకటనలో ఆరోపించారు. భర్తగా తాను తన భార్య మరణ ధ్రువీకరణ పత్రంను ఆర్.టి.ఐ తో సహా నాలుగు సార్లు దరఖాస్తు చేసినా కార్యదర్శి అశోక్ వాటిని బేఖాతరు చేశారని తెలిపారు. తన భార్య ఆస్తులను అక్రమంగా కాజేయాలనే దురుద్దేశ్యంతో ఉన్న చక్రధరరెడ్డి, అచ్యుత రామారెడ్డిలతో పంచాయితీ కార్యదర్శులు ఇద్దరూ కుమ్మక్కయ్యారని వెంకటరెడ్డి ఆరోపించారు. తన ఆర్టిఐ దరఖాస్తుకు బిక్కవోలు మండల అభివృద్ధి అధికారి స్పందిస్తూ తక్షణం పార్వతి మరణ ధ్రువీకరణ పత్రమును భర్త అయిన తనకు ఇమ్మని డిసెంబర్ 29న ఆదేశించినా, కార్యదర్శి అశోక్ సదరు ఆదేశాన్ని సైతం బేఖాతరు చేశారన్నారు. చివరకు స్పందనలో కలెక్టర్ కి తాను నివేదించగా కలెక్టర్ ఆదేశంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 9వ తేదీన తన భార్య మరణ ధ్రువీకరణ పత్రమును ఇచ్చారని ఆయన తెలిపారు. మండల అభివృద్ధి అధికారి ఆదేశాన్ని కూడా ఖాతరు చేయకపోవడానికి కారణం, వారసులు కాని వారికి తామిచ్చిన మరణ ధ్రువీకరణ పత్రంతో వారిలో ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందే విధంగా వారికి తగినంత సమయం ఇచ్చే దురుదేశ్యంతోనే కార్యదర్శులు కాలయాపన చేస్తూ వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారసులు కాని వారితో నేరపూరిత కుట్రలో భాగస్వాములు అయి కర్తవ్య నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్య వైఖరితో తప్పుడు సమాచారంతో రెవెన్యూ శాఖను మోసగించి, వారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందేందుకు వారితో కుమ్మక్కైన పూర్వ, ప్రస్తుత కార్యదర్శులతో పాటు సదరు నలుగురు కుట్రదారులపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కోనాల వెంకటరెడ్డి క్రిమినల్ కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు పై తగు విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ బిక్కవోలు సబ్ ఇన్స్పెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రకటన తో పాటు ఉన్నతధికారులు జారీ చేసిన ఆదేశాల వివరాలు కూడా వెంకటరెడ్డి మీడియా కు అందించారు.

