ఖమ్మం: నగరంలోని ఆర్జేసీ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వేడుకగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళికాబద్ధంగా కష్టపడితే విజయాలు సాధించవచ్చన్నారు. 28 ఏళ్లుగా కళాశాల అనేక విజయాలు సాధించిందని, విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు కృష్ణను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందించారు. విద్యార్థినీ విద్యార్థుల క్లాసికల్, వెస్ట్రన్, బ్రేక్, గ్రూప్, సోలో నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏ.లింగయ్య, ఇన్‌చార్జిలు ఆంజనేయులు, సునంద తదితరులు పాల్గొన్నారు.



