లోకేశ్వరం: మండలంలోని రాజురా గ్రామంలోని సెంటర్-3 అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలనతో పాటు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, పండ్లు, పౌష్టికాహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. చిన్నారులకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా వారి ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ ఇన్‌చార్జి నల్లుల సంగీత, పద్మజవాణి, సూపర్‌వైజర్ వీణ, సర్పంచ్ శ్యామల, కో-కన్వీనర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. పోషణ్ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహణ
లోకేశ్వరం: మండలంలోని రాజురా గ్రామంలోని సెంటర్-3 అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలనతో పాటు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, పండ్లు, పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. చిన్నారులకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా వారి ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఇన్‌చార్జి నల్లుల సంగీత, పద్మజవాణి, సూపర్‌వైజర్ వీణ, సర్పంచ్ శ్యామల, కో-కన్వీనర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

