ఖమ్మం, సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి): మూడో టౌన్ ప్రాంత అభివృద్ధిపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజల భద్రత, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ప్రకాష్‌నగర్‌లో శంకుస్థాపన కార్యక్రమానికి చిన్న పిలుపు ఇచ్చినా భారీగా ప్రజలు తరలిరావడం కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఆర్‌జేసీ కృష్ణ విడుదల చేసిన ఆడియో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని విమర్శించారు.
ప్రకాష్‌నగర్ చెక్‌డ్యామ్ తొలగింపు వరద ముప్పును నివారించేందుకేనని, దీనిపై కోర్టు తీర్పు కూడా వెలువడిందన్నారు. గత పదేళ్లలో పూర్తికాని మార్కెట్, తీగల వంతెన తదితర పనులకు ఆరు నెలల్లోనే శ్రీకారం చుట్టామని తెలిపారు. గొల్లపాడు కాలువ అభివృద్ధి ప్రణాళికలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. ఖమ్మం మార్కెట్ యార్డు అభివృద్ధిలో తుమ్మల కృషి కీలకమన్నారు.
సమావేశంలో నాగండ్ల దీపక్ చౌదరి, బాలగంగాధర్ తిలక్, కమర్తపు మురళి, గజ్జల వెంకన్న, కోనేటి వెంకన్న పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 60కి 60 డివిజన్లు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.



