రైతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని కూటమి ప్రభుత్వం విజయవంతంగా నెరవేర్చింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఆక్వా రైతుల కోసం సరికొత్త జీవో విడుదలయింది.
జోన్, నాన్-జోన్లతో సంబంధం లేకుండా, పదెకరాల పరిమితి నిబంధన లేకుండా అర్హులైన ప్రతి ఆక్వా రైతుకూ యూనిట్ విద్యుత్ కేవలం రూ. 1.50లకే అందించేందుకు శ్రీకారం చుట్టాం.
🚀 మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా.. అధికారంలోకి వచ్చిన కేవలం 26 నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏకంగా 99 శాతం అమలు చేసి చూపిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదే! ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాము.
🌾 రైతు సంక్షేమమే మన కూటమి ధ్యేయం!


