*వాతావరణం*
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్*
*రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.*
*అమరావతి:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.రాబోయే మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్రతను బట్టి వివిధ జిల్లాలకు రెడ్,ఆరెంజ్,ఎల్లో అలర్ట్‌లను ప్రకటించింది.
*🔴 రెడ్ అలర్ట్ (తీవ్ర హెచ్చరిక)*
ఉత్తరాంధ్రలోని *శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం* జిల్లాలకు అత్యంత అప్రమత్తత అవసరమని అధికారులు తెలిపారు.ఈ జిల్లాల్లో అక్కడక్కడ బలమైన పిడుగులు పడే ప్రమాదంతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
*🟠 ఆరెంజ్ అలర్ట్ (మధ్యస్థ హెచ్చరిక):*
*అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి* జిల్లాల్లో పిడుగుల తీవ్రతతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు.ఈ ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
*🟡 ఎల్లో అలర్ట్ (సాధారణ హెచ్చరిక)*
కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలోని *కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం* జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
*అధికారుల సూచనలు:*
వర్షం మరియు పిడుగులు పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించారు.


