నీట్ పేపర్ లికేజ్ కి బాధ్యుల పై కఠిన చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ, ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం అరకులోయ మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ నాయకులు కె.రామారావు, ఎస్.ఐసు బాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల, ఆశ్ఆరమ పాఠశాలల్లో హెల్త్ అసిస్టెంట్లను నియమించాలని పేర్కొన్నారు.

అరకు: నీట్ పేపర్ లికేజ్ కి బాధ్యుల పై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్