ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు
దుత్తలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుత్తలూరు తహసీల్దార్ నాగరాజు విద్యార్థులను అభినందించి సన్మానించారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 నగదు బహుమతిని అందజేసి మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధి, హాజరు, భవిష్యత్ లక్ష్యాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించారు. దుత్తలూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు సమావేశానికి హాజరై పాఠశాల అభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

దుత్తలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం సమావేశం –
ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు దుత్తలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుత్తలూరు తహసీల్దార్ నాగరాజు విద్యార్థులను అభినందించి సన్మానించారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 నగదు బహుమతిని అందజేసి మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధి, హాజరు, భవిష్యత్ లక్ష్యాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించారు. దుత్తలూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు సమావేశానికి హాజరై పాఠశాల అభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

