సంగం: మండలంలోని జంగాల కండ్రిగ కాలనీల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ నిరుపేదల ఇళ్ల సమస్యల పరిష్కారానికి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల విజయ చంద్ర చర్యలు చేపట్టారు. మర్రిపాడు జెడ్పీ హైస్కూల్ సమీపంలోని కాలనీల్లో మంజూరైన 20 ఇళ్లకు బేస్‌మెంట్ పూర్తికాకముందే నిధులు డ్రా చేసి కాంట్రాక్టర్ వెళ్లిపోయిన విషయాన్ని హౌసింగ్ ఏఈ గౌస్ మొహిద్దిన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే దశాబ్దం క్రితం మంజూరైన 22 ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇళ్లు స్లాబు వరకు నిర్మించి నిలిచిపోయిన సమస్యను వివరించారు. ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్ నజీర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంట్రాక్టర్‌పై చర్యలు, జంగల్ క్లియరెన్స్ చేసి నిర్మాణాలు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని విజయ చంద్ర తెలిపారు.

నిరుపేదల ఇళ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు